ప్రేమంటే- స్మృతియా?
ప్రేమంటే- అనుభూతులా?
ప్రేమంటే- ఆధారపడడమా?
ప్రేమంటే- దాస్యతా?
ప్రేమంటే- ఆరాధనా?
యీల చాల అనుబంధాలు ప్రేమ లో మిళితమయ్యాయి.
అన్నిటికంటే ముఖ్యమైంది,ప్రేమంటే స్వచ్చత, నూతనమైనది, పవిత్రమైంది.ప్రేమలో విధ్వంసం ఉండదు.ప్రేమను,ఇంటిలో పెంచుకునే మొక్కలా సమ్రక్షించుకోవాలి.
Monday, February 26, 2007
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ప్రేమటే చాలా బాగా చెప్పారు.మీరు చెప్పిన దానినే ఇంకాస్త వివరం గా....ప్రేమటే ఆకర్షణ.అది ఎక్కువయితే ఆరాధన.ఆరాధన ముదిరితే దాస్యత.దాస్యతలోనే ఆధారపడడం కూడా వుంటుంది.చెసేదంతా స్వచ్చం గా వుంటేనే ఆ ప్రేమ చాలా కాలం నిలబడుతుంది.పరిపూర్ణం గా ప్రేమించడం,పరిపూర్ణం గా ప్రేమించబడడం సాధ్యం కాదు.ప్రేమంటే మంచి మధురమయిన అనుభూతి అని అనుకుని ఆ అనుభూతిని కలకాలం ఆస్వాదించగలిగినా ఆ ప్రేమ నిలుస్తుంది.
ఏమన్నా అర్దం అయిందా?నాకే అర్దం కాలేదు ఇంకెవరికి అర్దం అవుతుందిలెండి....అర్దం కాకపోవడమేనేమో ప్రేమంటే.
నా ద్రుక్పధం : ప్రేమ ఒక వింత చెట్టు.
దీనికి ఉన్న ఒక కొమ్మ ఇంకొక కొమ్మ లాగ ఉండదు. ఒక కొమ్మ అందమైన రొజాపూలనిస్తే, ఇంకొకటి మనస్సును ఆహ్లాదపరిచే మల్లెలను, ఇంకొకటి గన్నేరు పూవును, వేరొకటి మన్మద పూలను, ఇంకొకటి తియ్యటి తేనెనిచ్చే పూలను, మరొక్కటేమో అందమైన పూల కొరకు అంతులేని కొమ్మ చివరకొరకు తీసుకెల్లేటివి..... ఇలా ఇలా ఇంకెన్నో...
ఇలా ఎందుకు లాగానంటే .. ఇక్కడ రకరకాల ప్రేమ కొమ్మలున్నా అన్నిటిలో ఉన్న సద్గుణం..ఇవ్వటమే ..
నా పరిభాషలో ప్రేమంటే ఇవ్వటము..మనస్పూర్వంగా పరిపూర్ణంగా అడగకుండా ఇవ్వడం...
మరి ఇస్తూన్నంతసేపూ తీసుకుంటూ ఉండేదే ఆ ఆఖరి కొమ్మ!! (ఇది కూడ ఒకరకమైన ప్రేమే అని అనేవాళ్ళూ లేకపోరు...)
రాధిక ధన్యవాదలు.మీ కుతూహలం నాకు నచ్చింది.మన ఆలోచనల్లో ప్రేమ యిలా వుండాలి అని ముద్ర ఉండడం వలన అది పరిప్ణూరంగా సాధ్యం కాదు అనుకుంటున్నాము. మనసులో యిన్ని మిళితమైన భావాల్ని శోధించి,ధ్యానించి,అవగాహన చేసుకున్న మనసు ప్రశాంతత పోందితే, హృదయమంతా ప్రేమనే కాదు?ప్రేమ ఎప్పుడూ ఎవరో కనిపెట్టింది కాదు. మనకు మనం కనుక్కోవాల్సింది. అంతాఓపిక,సహనం మనకు ఉందా?
గౌరి మాష్టారికి ధన్యవాదలు.
మీ టైమును వెచ్చించి,శోధించి నిర్వచించినందులకు.
అన్ని ప్రశ్నలతో వదలడానికి కారణం యిదేనేమొ.దాన్ని చదివిన నలుగైదురైనా ఆ రెండు నిమిషాలు ప్రేమ గూర్చి శోధిస్తారు కదా.
Post a Comment