Tuesday, June 26, 2007

మానవుల్ని తయారుచేయాలి

చాల రోజుల తరువాత తేనెగూడు చదివాను.తల్లుల్ని తయారుచేయ్యాలి
అనే టపా లోని అంశం ఆలోచించేట్లు చేసింది.అయితే అంత ముఖ్యమైన అంశంలొ ఆర్దత లోపించినట్లు అంపించిది.చాల గాటుగా విమర్శలు జరిగిన అంశాన్ని మళ్లీ ప్రస్తావించడం సమంజశమా అని సందిగ్దంలో పడినా,ప్రస్తావించా0ల్సిన అంశమే.నిజాన్ని రాయడానికి భయం దేనికి. చాల రోజుల gap తరువాత రాస్తున్నాను.ఒక విషయాన్ని చదివాక మన పరిధి లో చూసుకుని ఆవేషపడకుండా,చుట్టూ సమాజం ఎక్కువగా దేనికి ప్రముఖ్యత (యివాల్సిన అవసరం ఉన్నాప్పుడు)యివ్వదో అప్పుడు తేలియజేప్పాల్సిన బాధ్యత ప్రతి మానవుడికి ఉంది.అందరి దృష్టి లోకి తీసుకునిరావాలి,అందరు గమనిచేట్లు చెయ్యాలి.తల్లి పాత్రకు అంతటి విశిష్టత ఉందని నిజంగానే చేప్పుకునే,గమనించుకునే అవసరం ఉంది.
ఒక మంచి మానవుడుగా తయారవ్వడం ఎలా సాధ్యం ? మెట్టమెదట తల్లి ద్వారానే కదా సంస్కారం నేర్పబడేది.అంతటి ప్రాముఖ్యత ఉన్న అంశం మరుగున పడిపోకూడదు. ఒక బిడ్డ భద్యత తల్లిదేనా,తండ్రికి లేదా అన్నది కాదు ప్రశ్న.ఎవరి పరిధి లో వారు చేయడమే.యిందులో పోటి లేదు.ఎక్కడ లోపం జరిగిన నష్టపోయేది మనమే.అన్ని విధాల దేశపరంగా,సమాజపరంగా,వ్యక్తిత్వపరంగా.స్త్రీ గా తనకు చేతనైనది చేయ్యడమే,యిందులో బాధ,చులకన,selfpityలాంటి శభ్దాలకు తావులేదు.అయితే పిల్లల పెంపకం భాద్యత ఎవరూ నిర్ణయించేది కాదు.వారి వ్యక్తిగత అవసరం,అనుకూలం బట్టి జరగాల్సిందే.స్త్రీ,పురుషుడు సమానం అని prove చేసుకునే ఫోటి లో పిల్లల్ని మంచి పౌరులను చేయలేకపోతున్నామా అన్న సందిగ్దం ఏర్పడుతోంది.
మా అమ్మాయి చెప్పుతోంది,schoolలో జరిగే తతంగం గూర్చి.principal ప్రతిరోజు rules చెప్పడమే,పాటించడం లేదని.వందేమాతరం పాడడానికి సిగ్గుపడ్తున్నారంట higherclass students.principalతో punishment తీసుకుంటున్నారంట.యిలా ఎందుకు జరుగుతోoది?? మంచి school లో వేయడం వరకేనా మన భాద్యత??ఆ school లో ఏమి జరుగుతోందో పిల్లలతో ప్రతిరోజు తేలుసుకోవాల్సిన భాద్యత లేదా?చదువు ఒక్కటే ముఖ్యమైందా??school తో పాటు తల్లిదండ్రుల గమనింపు అవసరం లేదా?వందేమాతరం పాడడంలో prideness కనిపించడంలేదని ఆమె రోజూ చేప్తూనే వున్నారంట.India లో ఉండే వారికి దేశం మీద respect లేదా,బయటి నుండి వచ్చిన మేమేbetter అంటోంది మా అమ్మాయి. యింకో భయంకరమైన విషయం,8th చదివే అమ్మాయి అంటోందంట,independence రాకపోతే బాగుండు ఈ వదేమాతరం పాడే అవసరం ఉండేదికాదు అని.ఎక్కువగా ఇష్టం లేని పనులు వాళ్లతో forceగా చేయించడం వలననా!వారికి దేనికి విలువనివ్వాలి అని అంచనావేసుకునే శక్తి లేకుండాపోతోంది.ఈ విషయం అసంపూర్ణగానే ముగిస్తూన్నాను.

Sunday, April 1, 2007

మనం ఎలా ఆలోచించాలి........




మనము పుట్టినప్పటి నుండి ఏంచేయ్యాలి,ఏలాఉండాలి అని ఇతరులు చెప్తూ వుంటారు.
మనము చూసే సినిమా, చదివే సాహిత్యం, వినే మాటలు ద్వారా ఊహలో యిలా ఉండాలి అనే మూసలో కి వెళ్లిపోతాము.

" ఏమి ఆలోచించాలో,ఏమి ఆలోచించకూడదో అనే విషయం ఎప్పుడూ చెప్తూ వుంటారు,అయితే ఎవరూ ఏవిధంగా ఆలోచించాలో తేలుసుకోవడానికి మాత్రం మనకి సహాయం చేయరు.మన మనసులు చాలభాగం నిబద్ధతం చేయబడి వుంటాయి.నిబద్ధత మయిన మనసుకి స్వేచ్చ లేదు.ఎందువల్లనంటే చుట్టూ వున్న సరిహద్దులను దాటి ఆవలగా, తనచుట్టూ తానే నిర్మించు కున్న అడ్దుగోడలను దాటి ఆవలగా,అది వెళ్ళళేదు.యీ నిబద్ధీకరణం అన్నది సమాజం చేసేదే కాకుండా మనసు కూడా తనకు తానే విధించుకున్న నిర్భంధం కాబట్టి యిందులోండి బయటికి వచ్చే సాహసం మనలో ఉండదు.ఇదీ మనలో చాల మందిమి చిక్కుకునిపోయిన కారాగారం;ఈ కారణంగానే మన తల్లిదండ్రులు మనతో ఎప్పుడూ చెప్తుంటారు.మనవంతు వచ్చినప్పుడు మనం పిల్లలకు చెప్తూ వుంటాము.ఇది చేయండి.యిది చేయకండి అని." K.కౄష్ణమూర్తి-
ఇది చదివి చాల ఆశ్చర్యం కల్గింది ఈ ధోరణలో చూడలేదే అని. ఎప్పుడూ కాకున్న అప్పుడప్పుడైన పిల్లల మీద మరి రుద్దకుండ వుంటాము.మెదట మనకు తెలియడం ముఖ్యం కదా? పిల్లలంటే మన ఆశలు తీర్చే వాళ్ళు కారు కదూ? మనము వారికి ప్రపంచాన్ని చూడడానికే ఉపయొగపడుదాము.ఇదే ప్రపంచం అని చెప్పకుండా.

Friday, March 23, 2007

ఆధారపడడం ఎంతవరుకు సమంజసం ?

ఆధారపడడం మనిషిని బానిసను చేస్తుందా?ఈ ఆధారపడడ అనేది ప్రతి సంబంధంలో ఉంటుంది. అయితే అది ఎంతవరుకు సమంజసం అనేది ఎవరికి వారు అవగాహన చేసుకోవాలి.దేనిమీదైన ఎక్కువగా ఆధారపడుతున్నామని గమనించిన క్షణం నుండి మనల్నిమనము సమ్రక్షించుకుంటాము.అవును కదూ? ఎందుకంటే ఆధారపడం అంటే అసమర్ధతను ఆసరా చేసుకుంటున్నామని కాదు??
ఆలాగే మన అలవాట్లు T.V.చూడడం,బ్లాగులు రాయడం, friends తో phone లో మాట్లాడడం యీలంటి విషయలపై ఆధారపడడం వలన మనదినచర్యలో సృజనాత్మకత ఉండదు. ఇతరా పనులపై ధ్యాస తగ్గుతుంది.లేదా మిగతాదినచర్య ఆత్రుత,తొందర,ఏదొవకటి complete చేయ్యాలనే ప్రయాస కనిపిస్తుంది.ప్రతి రోజు జీవనసరళి మనకు సంతృప్తికరంగా చేసుకునే బాధ్యత మనమీదే ఉంది.అలాజరగాలంటే,మనల్ని మనం గమనించుకోవడం చాల అవసరం.దీనిద్వార పరస్పరసంబంధాలతో మనలోని బాధ,క్రోదం,సంతోషం సంఘర్షన అవగాహనకు వస్తుంది.చిన్న,చిన్న విషయాలు గమనించడం మనదినచర్యలో ని చాల చికాకులు తగ్గుతాయి.

"పరస్పరసంబంధాలలో వుండే మన మానసిక పరాధీనత్వాన్ని అవగహన చేసుకోవడం ముఖ్యమైన సంగతి. హృదయంలోను,మనసులోను దాగివున్న విషయాలను వెలికి తీయడంలో మన ఒంటరితనాన్ని,మనలోని ఖాళీతనాన్ని అవగహన చేసుకోవడంలో విముక్తి వున్నది. అయితే విముక్తి కలిగేది సంబంధబాంధవ్యాల నుండి కాదు, సంఘర్షన , దుర్భరవేదన,బాధ,భయాలకు కారణమయిన మానసిక పరాధీనత్వం నుండి విముక్తి కలుగుతుంది."-కె.కృష్ణమూర్తి.

Saturday, March 3, 2007

ప్రేమంటే...పనికిమాలినదా?


పనిలేనివారు మాట్లాడుకునేదా ప్రేమంటే- ఇది నిజం కూడనేమే ఒక వైపు నుండి చూస్తే. . ఎదుకంటే ప్రేమ అంత చులకనగా,హేయనీయంగా తయారైంది.
ప్రేమంటే... గుర్తు వచ్చేది అమ్మాయి అబ్బాయి ప్రేమ-
లేదా
తల్లి ప్రేమ- సాధారణగా తల్లిప్రేమ గూర్చి ఎంత ఉన్నతంగా నిర్వచిస్తారు,ఎంత గొప్పగా చెప్తారు.
ఎందుకు మనశాస్త్రాలు,పెద్దలు ఉన్నతంగాచెప్పడం వలననా,
లేక మనకు నిజంగానే తల్లిప్రేమ మీదా అవగాహన ఉందా??
తల్లి మీదా చూపే ప్రేమకంటే,మనం వినే, చూసే,చదివే నిర్వచనాల మీద ప్రేమభావం ఎక్కువ.(సాధరణంగా)
ఇంతకంటే లోతుకు పోవడం ఇష్టం లేదు.ఎందుకంటే నేను చేప్పాలనుకున్నదానికి diversion వస్తుంది.
ప్రేమకి మనదినచర్యలో, మన మానవసంభాధాలలో ఎంతటి ప్రాముఖ్యత ఉంది?అన్న విషయం మన అందరి దృష్టి లో నిల్పాలని.నా ఈ ప్రయత్నం ఎంతమందిని ఆకర్శింప చేయగలదు అనేది కాదు ముఖ్యం.ప్రత్యక్షంగా నాలో జరిగిన మార్పు యిలా పంచుకోవడం ద్వారా నాలాంటి యింకోకరిద్దర్ని ఆలోచింపచేసినా ,నా ప్రయత్నం వృధా కాదు.నన్ను నేను అయోమయం,సంఘర్షణల నుండి బయటపడేట్లుగా K.కృష్ణమూర్తిగారి ప్రసంగాలు చాల ఉపయోగపడ్దాయి.ప్రేమ అనేది వయస్సుకు సంభందించినదా? ఎంత మాత్రం కాదు.మనలోని వ్యతిరేకభావాలను(ఈర్ష,ఆధారపడడం,ఆశించడం,అధికారం) గమనించడం ద్వారా,(దాటివేయకుండా) మనలో వింతైన సృజనాత్మకత ఏర్పడుతుంది.రోజు ఉదయించే సూర్యుడి కి ఎంతటి విలువ ఉంది మన జీవన సరళిలో ! ఆ సూర్యుడు ఉదయించకపోతే ఎన్ని అవకతోకలు ఏర్పడుతాయో ఊహించగలం,అయితే మనలో ప్రేమ లేకపోతే జీవనసరళి ఎంత ఉధాసీనంగా,నిసత్తువుగా ఉంటుందో గమనించే ఓపిక,తీరిక ఉందా?
మనలో సున్నితత్వం నశిస్తోంది. ఆదర్శాలమీద, నిర్వచనాల మీదా పట్టుదల ఉంటుంది,నిత్యం జరిగే చర్యల మీద గమనింపుమరుగౌవుతోంది.
పిల్లలికి సూర్యోదయం,సూర్యాస్తమయం ఎంతమంది చూపగలుగుతున్నాము?అది చేయడానికి మనలో ఎంతటి సృజనాత్మకత ఉండాలి??పిల్లల కి అభిరుచులే లేకుండా పోతున్నాయనుకుంటాము,దానికి మన ప్రవర్తన ఎంతవరుకు కారణమైందో గమనిస్తె,మనలొ తప్పక చైతన్యం వస్తుంది.యిలా ప్రతి మానవ సంభంధం ప్రేమ తో ముడిపడి ఉంటాయి.

"యిలా సమస్యలతో నిండి వున్న మన ప్రపంచానికి ఒక సరికొత్త తీరులో వుండే నీతి, నడవడిక,వీటితో పాటు జీవిత విధానాన్ని అంతటినీ ఆకళింపు చేసుకోవడంలో నుండి ఉద్భవించే ఒక కార్యాచరణ రావలసిన తక్షణావశ్యకత వున్నది." -K.కౄష్ణమూర్తి

Monday, February 26, 2007

ప్రేమంటే.....

ప్రేమంటే- స్మృతియా?
ప్రేమంటే- అనుభూతులా?
ప్రేమంటే- ఆధారపడడమా?
ప్రేమంటే- దాస్యతా?
ప్రేమంటే- ఆరాధనా?

యీల చాల అనుబంధాలు ప్రేమ లో మిళితమయ్యాయి.

అన్నిటికంటే ముఖ్యమైంది,ప్రేమంటే స్వచ్చత, నూతనమైనది, పవిత్రమైంది.ప్రేమలో విధ్వంసం ఉండదు.ప్రేమను,ఇంటిలో పెంచుకునే మొక్కలా సమ్రక్షించుకోవాలి.

Monday, February 19, 2007

పాత్ర - విశిష్టత

సీతమ్మతల్లి లో నిగూఢమైన ఆదర్శాలు ఎన్ని
యుగాలైనా మనకు పూజ్యనీయం.

రాముడి వెంట అడవులకు వెళ్లిన సీత, భర్త ఆదర్శాన్ని ఆకళింపుచేసుకుని, దాని విలువ తేల్సుకుని అనుసరించిన ప్రఙ్ఞావంతురాలు.

బంగారులేడిని అడగడం లో తన ముచ్చటను,చనువును,స్త్రీ సహజధోరణి బయట పెట్టింది.

బ్రాహ్మణుడికి భిక్ష పెట్టడం లో, ధర్మశీలిగా , పేదబ్రాహ్మణుడికి ఆకలి తీర్చడమే ముఖ్యమైనదని నమ్మిన దాయాగుణం కనపడతాయి.

రావణాసురిడి దగ్గర తన్ను తాను రక్షించుకొవడంలో ఆమె ఆత్మస్థైర్యం కనపడుతంది.

ఆగ్నిప్రవేశం ద్వార పవిత్రత,అన్నిటికంటే ముఖ్యమైనది తెలిపింది.

నిండు గర్భినిని కఠోరంగా రాముడు(ఎంతటి బలమైన ఉద్ద్యేశం ఉన్నా) అడవులకు పంపినా,ఇసుమంతైన కోపం కనిపించక శాంతంగా కర్తవ్యపాలన చేసింది.

ఎన్ని కష్టాలు పడినా లవకుశలకు తండ్రి మీద ఉన్న గౌరవం ఆమె ఉన్నత పెంపకానికి నిదర్శనం.

ఇక ఆఖరున భూమిలో కల్సి పోవడం,ఆమె ఆత్మగౌరవం చక్కగా ప్రకిటతమవుతుంది.

ఇంకాఎన్నో ఔదార్యాలు గల సహనశీలి సీత. ఇదీ సీతలోని మహోన్నత.

సీతారాములు నిజంగానే ఆదర్శదంపతులు. రాముడి కీర్తి పైకి ప్రకటితమైతే, సీత గొప్పతనం మన అంతరాళ్లలో మిళితమైంది. మనం గమనించాల్సింది ఆ పాత్రలు,పరిస్థితులు కాదు.ఇద్దరి ప్రేమ,నమ్మకం,అవగహన.

సహజంగా సీత కష్టాల్ని స్త్రీలు తెరిపార తేల్సుకేవడానికి,తలవడానికి భయపడ్తారు. అందుకేనేమో శ్రీ స్వామి వివేకనంద చేప్పారు "రాముడి లాంటి పురుషులు పలువురు ఉండవచ్చునేమో గాని సీతవంటి మహిళ లేనేలేదు. కలతి లేని భారతీయ మహిళకు ఆమే సరైన లక్ష్యం."

"స్త్రీలను నవ్యపద్ధుతులకు తెచ్చే ప్రయత్నంలో వారు ఆ సీతాదర్శానికి ఎడసి పోవలసి వస్తే,ఆ ప్రయత్నం వెంటనే భంగపడుతుందని అనటం మనం ప్రతిరోజు చూస్తున్నాం. భారతీయ మహిళలు పెంపొందటానికి, శ్రేయస్సు గాంచటానికి సేతామార్గాన్ని ఒక్కదాన్నే అనుసరించాలి, వేరే మార్గం లేదు."

ఇది ఎవరు చెప్పారన్నది కాదు ముఖ్యం యిందులో ఎంత నిజమున్నదో గమనించాలి. ఏది ఆదర్శంగా తీసుకోమని కాదు ఉద్ధేశ్యం. మన 'దేశం ఆదర్శం' మనకు తెలియడం ద్వార మనకు ఎదురయ్యే పరిస్ఠులను ఎదుర్కోనే సామర్ధత, నిభ్భరం మనలో కల్గుతాయని నా నమ్మకం.

"స్త్రీ ల బాహ్యరూపాలు యింద్రియాలకు ఆకర్షణ కల్గించి పురుషులను పిచ్చివారిని చేశాయి.కాని ఙ్ఞానం, భక్తి వివేకవైరాగ్యాలైన వారి ఆంతరరూపాలు మానవుడు దర్శిస్తే అతడు సర్వఙ్ఞుడు, ఆమోఘసంకల్పుడు,బ్రహ్మఙ్ఞాని అవుతాడు." (శ్రీ స్వామి వివేకనంద)

స్త్రీ సహజధోరణి నుండి బయట పడి నిజతత్వాన్ని గమనించల్గితే చాల చికాకులు తప్పుతాయి.
'సలహాలు యివ్వడమే
పనిగా పెట్టుకున్నాననుకోకు లోకమా
జీవిత అవగాహనా అనే లోగిలిలో అడుగిడి
చాల ఏళ్లే అయ్యింది
తెల్సింది పంచుకోవడం లోని
ఆనందం వేరు కదా నేస్తమా!'

Friday, February 16, 2007

ప్రేమ పూరితమైన నవ్యసమాజాన్ని మనమే నిర్మించగలమా??

ఎంతటి బలమైన,అర్ధవంతమైన ప్రాంతీయవాదమైన,జాతీయవాదమైన మానవతావాదం కి మించినదికాదు.మన బ్లాగులో ప్రాంతీయవాదంగూర్చిన చర్చలు కలవరపెట్టాయి.ఆవాదనలో తప్పోప్పు కాదు మనకు కావల్సింది.ఈవాదనలతో మనకు మనము పరాయిభావన్ని ఎక్కువగా చేసుకుంటున్నామా అనే అలజడి కల్గింది.
అనుకోకుండా ఏదైన నిప్పు అంటుకుంటే వెంటనే ఆర్పడానికి ప్రయత్నిస్తాము.చర్య వెంటనే ఉంటుంది.ఎందుకంటే అది ఎంత ప్రమాదమొ మనకు తెల్సు.ఉపయోగంలేదని తేల్సినా మరి ఈ వాదనల్ని ఆపుచేయలేము!మనకు కావల్సింది కాలక్షేపం,ఎవరికివారు నాపద్దతి,నావాదన గొప్పది అని నిరూపించుకోవాలని తాపత్రయం.
J.కృష్ణమూర్తిగారు చెప్పినట్లు, "మనం నివసిస్తున్న ఈ పరిసరాల నుంచీ,ఈ బాంధవ్యాల నుంచి,ఈ ప్రపంచం నుంచీ ఎక్కడికో పారిపోవడం కాదు.ఇక్కడే వుండి,ఈక్షణంలోనే ఈ సమస్యలను అవగాహన చేసుకొని,స్వేచ్ఛగల మనుష్యులై బ్రతకడం సాధ్యమా??"
నాకు ప్రత్యేకించి ఏ ఙ్ఞానం లేదు.అయితే నా చర్యల్ని,చుట్టూ జరిగే చర్యల్ని గమనిస్తూ,అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.ఇలా ఎరుకలో ఉండడం వలన మన చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశముంది.ఎందుకంటే మనల్ని ఏ మోసపు వాదనలు నమ్మించేట్లు చేయలేవు.నేను ఇంకా అంత బాగా వివరించే స్థాయికి ఎదగలేదనుకుంటా.
మనస్పూర్వకంగా ప్రేమపూరితమైన నవ్య సమాజాన్ని నిర్మించుకునే శక్తిని మనకు యివ్వామని దేవున్ని ప్రార్థిస్తూ....

Thursday, February 15, 2007

మానవతా సంభందాల పై నా అవగాహన, ఎరుక, ఆవేదన.....


మానవతా సంభందాలు మెరుగు పడడం ఎలా?? అనే అంశం అందరి దృష్టి లో కి రావాలని, ఈ అంశం ఎరుకలోకి రావాలని నా ఆత్రుత. ఈ విషయం పై నేను ఏదో సలహా యివ్వాలని కాదు. ఈ విషయం ఎవరికి వారు శోధించఢం, గమనించడం ద్వార మన భాంధవ్యాలు మెరుగనపడగలవని నా నమ్మకం.

కుటుంభంలోని వ్యక్తులు, మిత్రులు, చుట్టూ గల సమాజం తో మనకు గల సంభందాలు తృప్తి కరంగా ఉన్నాయా?? మన మధ్య సంభందాలు పుష్టికరంగా లేకపోతే మనలో మిగిలేది అశాంతి,ఘర్షణ,వైరము లాంటి వ్యతిరేకభావలు. ఇవన్ని వ్యక్తి శక్తిని నశింపచేస్తాయి. ఇందులోనుండి బయటపడం ఎలా??

ఇలాగనే ఎంత పురోగమనం సాధించినా, స్వీయఙ్ఞానం లేకుండా నిజమైన,గంభీరమైన చర్యను దేనిని చేపట్టినా పునాది వుండదు,ఆధారముండదు. స్పష్టమైనదానిని నిర్మించాలంటే ఒక ఆధారముండి తీరాలి. తనను తాను తెలుసుకోకపోతే మనము కృత్రిమ జీవితాన్ని జీవిస్తాము.

మన ఉహాస్థితిలోని ఇతరుల వ్యక్తిత్వము నిజము కాదు. వారు ఉంటున్నదే నిజము. దీనిని స్వీకరించడమే సరైన మార్గము.

ఇలాంటి విషయాల గురించి జిడ్డు క్రిష్ణమూర్తి ప్రసంగాలు అవగాహన కలిగిస్తాయి.

" ప్రపంచం మొత్తం నీలోఉన్నది.
ఎలాచూడాలో గ్రహించాలో తెలిస్తే
తలుపక్కడే ఉన్నది. భూమి మీద
ఉన్న ఏ ఒక్కరూ నీకా తాళం చెవినీ
యివ్వలేరు, తెలుపూ తెరువలేరు
నీవు తప్ప!"