Friday, February 16, 2007

ప్రేమ పూరితమైన నవ్యసమాజాన్ని మనమే నిర్మించగలమా??

ఎంతటి బలమైన,అర్ధవంతమైన ప్రాంతీయవాదమైన,జాతీయవాదమైన మానవతావాదం కి మించినదికాదు.మన బ్లాగులో ప్రాంతీయవాదంగూర్చిన చర్చలు కలవరపెట్టాయి.ఆవాదనలో తప్పోప్పు కాదు మనకు కావల్సింది.ఈవాదనలతో మనకు మనము పరాయిభావన్ని ఎక్కువగా చేసుకుంటున్నామా అనే అలజడి కల్గింది.
అనుకోకుండా ఏదైన నిప్పు అంటుకుంటే వెంటనే ఆర్పడానికి ప్రయత్నిస్తాము.చర్య వెంటనే ఉంటుంది.ఎందుకంటే అది ఎంత ప్రమాదమొ మనకు తెల్సు.ఉపయోగంలేదని తేల్సినా మరి ఈ వాదనల్ని ఆపుచేయలేము!మనకు కావల్సింది కాలక్షేపం,ఎవరికివారు నాపద్దతి,నావాదన గొప్పది అని నిరూపించుకోవాలని తాపత్రయం.
J.కృష్ణమూర్తిగారు చెప్పినట్లు, "మనం నివసిస్తున్న ఈ పరిసరాల నుంచీ,ఈ బాంధవ్యాల నుంచి,ఈ ప్రపంచం నుంచీ ఎక్కడికో పారిపోవడం కాదు.ఇక్కడే వుండి,ఈక్షణంలోనే ఈ సమస్యలను అవగాహన చేసుకొని,స్వేచ్ఛగల మనుష్యులై బ్రతకడం సాధ్యమా??"
నాకు ప్రత్యేకించి ఏ ఙ్ఞానం లేదు.అయితే నా చర్యల్ని,చుట్టూ జరిగే చర్యల్ని గమనిస్తూ,అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను.ఇలా ఎరుకలో ఉండడం వలన మన చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యకరంగా ఉండడానికి అవకాశముంది.ఎందుకంటే మనల్ని ఏ మోసపు వాదనలు నమ్మించేట్లు చేయలేవు.నేను ఇంకా అంత బాగా వివరించే స్థాయికి ఎదగలేదనుకుంటా.
మనస్పూర్వకంగా ప్రేమపూరితమైన నవ్య సమాజాన్ని నిర్మించుకునే శక్తిని మనకు యివ్వామని దేవున్ని ప్రార్థిస్తూ....

No comments: