మానవతా సంభందాలు మెరుగు పడడం ఎలా?? అనే అంశం అందరి దృష్టి లో కి రావాలని, ఈ అంశం ఎరుకలోకి రావాలని నా ఆత్రుత. ఈ విషయం పై నేను ఏదో సలహా యివ్వాలని కాదు. ఈ విషయం ఎవరికి వారు శోధించఢం, గమనించడం ద్వార మన భాంధవ్యాలు మెరుగనపడగలవని నా నమ్మకం.
కుటుంభంలోని వ్యక్తులు, మిత్రులు, చుట్టూ గల సమాజం తో మనకు గల సంభందాలు తృప్తి కరంగా ఉన్నాయా?? మన మధ్య సంభందాలు పుష్టికరంగా లేకపోతే మనలో మిగిలేది అశాంతి,ఘర్షణ,వైరము లాంటి వ్యతిరేకభావలు. ఇవన్ని వ్యక్తి శక్తిని నశింపచేస్తాయి. ఇందులోనుండి బయటపడం ఎలా??
ఇలాగనే ఎంత పురోగమనం సాధించినా, స్వీయఙ్ఞానం లేకుండా నిజమైన,గంభీరమైన చర్యను దేనిని చేపట్టినా పునాది వుండదు,ఆధారముండదు. స్పష్టమైనదానిని నిర్మించాలంటే ఒక ఆధారముండి తీరాలి. తనను తాను తెలుసుకోకపోతే మనము కృత్రిమ జీవితాన్ని జీవిస్తాము.
మన ఉహాస్థితిలోని ఇతరుల వ్యక్తిత్వము నిజము కాదు. వారు ఉంటున్నదే నిజము. దీనిని స్వీకరించడమే సరైన మార్గము.
ఇలాంటి విషయాల గురించి జిడ్డు క్రిష్ణమూర్తి ప్రసంగాలు అవగాహన కలిగిస్తాయి.
" ప్రపంచం మొత్తం నీలోఉన్నది.
ఎలాచూడాలో గ్రహించాలో తెలిస్తే
తలుపక్కడే ఉన్నది. భూమి మీద
ఉన్న ఏ ఒక్కరూ నీకా తాళం చెవినీ
యివ్వలేరు, తెలుపూ తెరువలేరు
నీవు తప్ప!"
6 comments:
తెలుగు బ్లాగ్లోకానికి స్వాగతం. మంచి విషయంతో మొదలుపెట్టారు. రాస్తూనే ఉండండి...
బాగుందండి. మంచి సబ్జెక్ట్. విరమించకుండా రాయండి. ఎందుకంటే, మీరెంచుకోనా సబ్జెక్ట్ కేవలం "నాలోకం" కాదు...
మన లోకం
మానవ లోకం
మనసు లోకం
మన సులోకం
మనందరి కోసం
-- నాగరాజు
చాలా చక్కగా వివరించారు
గొప్ప ప్రయత్నం.
మన లోకం (బ్లాగుల లోకం) లో మానవీయకోణం ఈ మౌని మాట.
Post a Comment