ఆధారపడడం మనిషిని బానిసను చేస్తుందా?ఈ ఆధారపడడ అనేది ప్రతి సంబంధంలో ఉంటుంది. అయితే అది ఎంతవరుకు సమంజసం అనేది ఎవరికి వారు అవగాహన చేసుకోవాలి.దేనిమీదైన ఎక్కువగా ఆధారపడుతున్నామని గమనించిన క్షణం నుండి మనల్నిమనము సమ్రక్షించుకుంటాము.అవును కదూ? ఎందుకంటే ఆధారపడం అంటే అసమర్ధతను ఆసరా చేసుకుంటున్నామని కాదు??
ఆలాగే మన అలవాట్లు T.V.చూడడం,బ్లాగులు రాయడం, friends తో phone లో మాట్లాడడం యీలంటి విషయలపై ఆధారపడడం వలన మనదినచర్యలో సృజనాత్మకత ఉండదు. ఇతరా పనులపై ధ్యాస తగ్గుతుంది.లేదా మిగతాదినచర్య ఆత్రుత,తొందర,ఏదొవకటి complete చేయ్యాలనే ప్రయాస కనిపిస్తుంది.ప్రతి రోజు జీవనసరళి మనకు సంతృప్తికరంగా చేసుకునే బాధ్యత మనమీదే ఉంది.అలాజరగాలంటే,మనల్ని మనం గమనించుకోవడం చాల అవసరం.దీనిద్వార పరస్పరసంబంధాలతో మనలోని బాధ,క్రోదం,సంతోషం సంఘర్షన అవగాహనకు వస్తుంది.చిన్న,చిన్న విషయాలు గమనించడం మనదినచర్యలో ని చాల చికాకులు తగ్గుతాయి.
"పరస్పరసంబంధాలలో వుండే మన మానసిక పరాధీనత్వాన్ని అవగహన చేసుకోవడం ముఖ్యమైన సంగతి. హృదయంలోను,మనసులోను దాగివున్న విషయాలను వెలికి తీయడంలో మన ఒంటరితనాన్ని,మనలోని ఖాళీతనాన్ని అవగహన చేసుకోవడంలో విముక్తి వున్నది. అయితే విముక్తి కలిగేది సంబంధబాంధవ్యాల నుండి కాదు, సంఘర్షన , దుర్భరవేదన,బాధ,భయాలకు కారణమయిన మానసిక పరాధీనత్వం నుండి విముక్తి కలుగుతుంది."-కె.కృష్ణమూర్తి.
Friday, March 23, 2007
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
మీరన్నట్టే ఫోను మాట్లాడడం వంటి అలవాట్ల వల్ల నా దినచర్యను త్వరగా పూర్తి చెయ్యాలనే కంగారులో ఒత్తిడి పెంచెసుకుంటున్నాను.బ్లాగురాయాలన్న ,ఇతరుల బ్లాగులు చదవాలన్న ఆత్రుత వల్ల కూడా దినచర్య ప్రశాంతం గా మొదలు పెట్టట్లేదు.బ్లాగు రాయడం స్రుజనాత్మకత అనుకుంటూ నన్ను నేను మోసం చేసుకుంటున్నానంటారా?
ఒక గంట సమయం spend చేసేమనrelaxation కోసం మిగతా 23 గంటలు దాని గూర్చి ఆలోచించడం, ఆ ధ్యాసలో మిగతా దినచర్య భారం కావడం మనల్ని మనము సంఘర్షణలో పడివేసుకోవడం లేదు.మన ఒక అలవాటు,మిగతా దినచర్యను యింత యిబ్బందుల్లో పడేస్తుందన్న అవగాహన వచ్చాక,దాని మీద అంత మోజు,ఆత్రుత క్రమంగా మరుగునపడ్తుంది.నాఉద్ధేశ్యం ఆ అలవాటు వదులుకోమని కాదు,మనమిగతా దినఛర్యలో దానిప్రభావం సంఘర్షణ కాకూడదు.మనం చేసే పనిలో సంఘర్షణ ఉంటే అది సృజనాత్మకత ఎలా అవుతుంది.నా అవగాహనలో అలా అంపించింది.
Post a Comment